21వ అఖిల భారత పశుగణన గోడ పత్రికను తెనాలి సబ్ కలెక్టర్ వి. సంజానా సింహ ఆవిష్కరించారు. శుక్రవారం తెనాలి లో ఆమె మాట్లాడుతూ పశుగణన గురించి, అభివృద్ధి పనులను గురించి వివరించారు. సంచాలకులు, డైరెక్టర్లు అందరూ విస్తృత పరచాలని ఈ పత్రిక అందరికి అందజేసే విధంగా కృషి చేయాలని చెప్పారు. నేటి నుండి ఈ నెల 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించ బడుతుందని అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.