ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను శనివారం రాత్రి గన్నవరంలోని విమానాశ్రయం నందు వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు కలిసి పుష్పగుచ్చం అందజేసే స్వాగతం పలికారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆనందబాబు అమిత్ షాకు వివరించారు. అనంతరం ఇద్దరు కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు.