సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద మకర జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మకర జ్యోతిలో కర్పూరం అర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు దోగిపర్తి బాబు, పొత్తూరి ప్రసాదు, అర్చకులు పొట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.