వినుకొండ మండలం నడిగడ్డలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని సోమవారం ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించనున్నారు. పశు సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 20 నుంచి 31 వరకు నిర్వహించనున్న ఉచిత పశువైద్య శిబిరాలను పాడిరైతులు, పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.