టెస్లా భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ మోడల్‌ను పరిశీలిస్తోంది. జపాన్, భారత్ కు చెందిన ఆటోమేకర్లతో చర్చలు జరుపుతోంది. టెస్లా తన సొంత ఫ్యాక్టరీ నిర్మించకుండా, ఇప్పటికే ఉన్న ఆటోమొబైల్ తయారీదారుల స్పేర్ కెపాసిటీని ఉపయోగించుకునే అవకాశాలపై దృష్టి పెట్టింది. ఈ చర్చలు సక్సెస్ అయితే, టెస్లా భారత్ లో లోకల్ తయారీ ద్వారా తన కార్ల ధరను తగ్గించుకునే అవకాశం ఉంది.