TG: బీజేపీ అధ్యక్ష రేసులో తాను లేనని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇస్తే మాత్రం వద్దను అని అన్నారు. అధ్యక్షుడిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నానని, కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకం అని, కార్యకర్తలను కన్య్ఫూజ్ చేయవద్దని హితవు పలికారు. పార్టీ పెద్దలే అధ్యక్షుడిని నిర్ణయిస్తారని బండి పేరొన్నారు.