పంజాబ్‌లోని జలందర్‌లో పట్టపగలే ఓ దొంగ రెచ్చిపోయాడు. ఇంట్లోకి చొరబడిన దొంగ చోరీకి విఫలయత్నం చేశాడు. అయితే ఇంట్లోని వృద్ధురాలు అతడిని అడ్డుకోవడంతో పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసి పారిపోయాడు. దాడి దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.