కూటమి ప్రభుత్వంలో నంబర్ టూ ఆయనే!

56చూసినవారు
కూటమి ప్రభుత్వంలో నంబర్ టూ ఆయనే!
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. దాదాపుగా మంత్రులు అందరూ చార్జి తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు ఉన్నారు. ఇక చంద్రబాబు తరువాత సీనియర్లు చూస్తే కేబినెట్ లో పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఇక టీడీపీ కూటమిలో కీలకమైన మిత్ర పక్షంగా జనసేన ఉంది. ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన అయిదు కీలకమైన శాఖలను చూస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం తరువాత పవన్ కే అని చెప్పాల్సి ఉంటుంది. అలా చూస్తే కనుక పవన్ నంబర్ టూ అవుతారు అని అంటున్నారు.

సంబంధిత పోస్ట్