తినడానికి చికెన్ పెట్టలేదని చంపేశాడు

77చూసినవారు
తినడానికి చికెన్ పెట్టలేదని చంపేశాడు
తినడానికి చికెన్ పెట్టలేదని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా మురడి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంజనేయస్వామి ఆలయంలో స్వీపర్‌గా పని చేస్తున్న మురుడప్పకు చికెన్ తినాలనిపించింది. చికెన్ తీసుకుని చెట్టు కింద వండటం మొదలు పెట్టాడు. అదే గ్రామానికి చెందిన ఏసు రాజు తనకు కూడా చికెన్ పెట్టమని అడిగాడు. మురుడప్ప పెట్టనని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో ఏసు రాజు బండరాయితో మురుడప్ప తలపై కొట్టి చంపాడు.

సంబంధిత పోస్ట్