స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ అప్పట్లో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించింది. ప్రభుత్వ తరపు న్యాయవాది మారినట్లు కోర్టు దృష్టికి లాయర్లు తీసుకెళ్లారు. ఈ కేసుపై సర్కారు నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున విచారణ రెండు వారాలు వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో చంద్రబాబు 50 రోజులకుపైగా జైలులో ఉన్న విషయం తెలిసిందే.