తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలే 164 సీట్లు సాధించగా.. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదాకు కనీసం 18 సీట్లు అవసరం.