ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరికలు జారీ

52చూసినవారు
ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరికలు జారీ
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇవాళ వాతావరణ శాఖ తెలిపింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయని పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్