భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

53చూసినవారు
ఏపీలో భారీ వర్షాల కారణంగా అల్లూరి జిల్లాలో ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఇవాళ ఒక్కరోజు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాలకు నేడు సెలవు ఇచ్చారు. ఆయా జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో జనజీవనం స్తంభించింది.

సంబంధిత పోస్ట్