యూపీలోని మలిహాబాద్‌లో నయా ఖేడా గ్రామంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనూజ్ అనే వ్యక్తి తన మారుతీ వ్యాన్‌లో ఎల్‌పిజి సిలిండర్‌ను రీఫిల్ చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు కేకలు వేయడంతో తొక్కిసలాట జరిగింది. కొందరు సబ్‌మెర్సిబుల్ పంప్‌ను స్టార్ట్ చేసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న దుకాణం పైకప్పు కాలిపోయింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.