గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్‌ఛేంజర్’ జవనరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. అయితే, యూకేలోని ది లైట్ సినిమాస్‌లో అప్పుడే గేమ్‌ఛేంజర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. సరిగ్గా నెల రోజులు ఉండగానే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. యూకేలో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది.