విజయవాడలో దంచికొడుతున్న వానలు

81చూసినవారు
విజయవాడలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో గుణదల, మొగల్రాజపురం, చిట్టినగర్, పాయకాపురం, భవానీపురం తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. నగరంలో రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్