రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్‌వైడీ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఖమ్మం, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసిన సంగతి తెలిసిందే.