AP: ఆస్తుల విషయంలో చెల్లికి మంచి చేయబోయి జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ తెలిపింది. 'సరస్వతి పవర్ విషయంలో లీగల్ సమస్యలున్నాయి. కేసులు తేలాక ఆస్తులు ఇస్తానని MoU రాసిచ్చారు. కానీ చట్ట విరుద్ధంగా షేర్లు బదిలీ చేయడమే సమస్యకు కారణమైంది. ఇది జగన్ బెయిల్ రద్దుకు పరిస్థితులు సృష్టించడం కాదా? గత్యంతరం లేక లీగల్ స్టెప్ తీసుకున్నారు. జగన్ పదేళ్లలో రూ.200 కోట్లు షర్మిలకు ఇచ్చారు' అని తెలిపింది.