AP: హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే తన పిల్లలను కూడా పక్కన పెడతానన్నారు. తన పీఏ సంధు జగదీశ్‌పై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన పీఏను చాలా సార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని, అందుకే తాను స్వయంగా తొలగించానని చెప్పారు. ఆదివారం విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత సందర్శించి మీడియాతో మాట్లాడారు.