మాచర్లలో టెన్షన్.. TDP నేతల గృహనిర్బంధం

42497చూసినవారు
మాచర్లలో టెన్షన్.. TDP నేతల గృహనిర్బంధం
టీడీపీ నేతలు ఛలో మాచర్లకు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. గొల్లపూడిలో దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. అలాగే నడికుడి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తాము మాచర్లకు వెళ్తామని టీడీపీ నేతలు చెబుతుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్