AP: మంగళగిరిలో మూడో రోజు ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నాం. ఏపీ ప్రజల కోరిక మేరకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. ఇవాళ 3 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఏప్రిల్ 13న వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయబోతున్నాం.’ అని అన్నారు.