ఉపాధ్యాయుడి ప్రాణం తీసిన సిగరెట్

73చూసినవారు
ఉపాధ్యాయుడి ప్రాణం తీసిన సిగరెట్
TG: సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారుకున్న ఓ ఉపాధ్యాయుడికి మంటలు అంటుకుని ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట(D) కోదాడ(M) మంగలి తండాకు చెందిన ధరావత్‌ బాలాజీ (52) నడిగూడెం(M) చెన్న కేశవాపురం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా బాలాజీ సిగరెట్‌ తాగుతూ ఆరుబయట మంచంపై నిద్రలోకి జారుకున్నాడు. సిగరెట్‌ మంచం నవారుపై పడి మంటలు అంటుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బాలాజీ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్