మారిషస్ నేషనల్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా మోదీ

61చూసినవారు
మారిషస్ నేషనల్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా మోదీ
మారిషన్ 57వ స్వాతంత్య్ర దినోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గూలమ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు రాబోయే వేడుక సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రఖ్యాత ప్రపంచ అధినేతల్లో మోదీ ఒకరు. బిజీ షెడ్యూల్‌లో కూడా మా ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నాం' అని తెలిపారు. అయితే ఈ కార్యక్రమం మార్చి 12న జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్