AP: సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీకి భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఈ పండుగకు 7,200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ.12 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. పండుగ వేళ 4 లక్షల మంది ప్రయాణం చేసినట్లు వివరించారు. సెలవుల అనంతరం కూడా తిరుగు ప్రయాణికులకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.