సైఫ్ అలీఖాన్‌పై దాడి నేపథ్యంలో ఆయన సతీమణి కరీనా కఫూర్ మరోసారి స్పందించారు. దాడికి సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాలు, వీడియోలపై ట్విటర్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ఛానల్ సృష్టించిన వీడియోను ఓ నటుడు సోషల్ మీడియో షేర్ చేయగా ఆమె రియాక్ట్ అయ్యారు. ‘దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి’ అంటూ పోస్టు పెట్టారు. అయితే కొన్ని క్షణాల్లోనే దాన్ని డిలీట్ చేయడం గమనార్హం.