AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బెదిరింపులకు పాల్పడ్డారు. తన ఇంటికి మూడు నెలలుగా విద్యుత్ బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టిన ఆయన.. కనెక్షన్ తొలగించినందుకు అధికారులపై మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీమోహన్ రావుకు ఫోన్ చేసి.. బూతులు తిట్టారు. టెక్కలిలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానని బెది ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, దువ్వాడ ఇంటి కరెంట్ బిల్లు రూ.56,692 ఉంది.