AP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. '1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం NTR స్థాపించిన టీడీపీ 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను' అని పవన్ Xలో పోస్ట్ చేశారు.