భారీ భూకంపం.. ప్రపంచ దేశాల ఆపన్నహస్తం

69చూసినవారు
భారీ భూకంపం.. ప్రపంచ దేశాల ఆపన్నహస్తం
మయన్మార్‌, థాయ్‌లాండ్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే భారత్‌ ‘ఆపరేషన్‌ బ్రహ్మ’ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. అటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్‌ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్