AP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ.. మన తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో దేదీప్యమానం వెలుగుతోంది. ‘జై తెలుగుదేశం’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది. తెలుగు వారి ఆత్మగౌరవం ‘తెలుగుదేశం పార్టీ’.’ అని చంద్రబాబు అన్నారు.