రాష్ట్రంలో ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీయాల్సి వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం హెచ్చరించారు. నేమకల్లులో సీఎం మాట్లాడుతూ.. "ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది. ఎవరైతే షాపులు తీసుకున్నారో వారే అమ్ముకోవాలి. ఇతర నాయకులు గాని, దందాలు చేసేవారు గాని అందులో జోక్యం చేసుకుంటే మాత్రం నేను ఎవ్వరినీ వదిలిపెట్టను." అని సీఎం పేర్కొన్నారు.