దేశంలో పింఛను ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నేమకల్లు ‘ప్రజా వేదిక- పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొని సీఎం మాట్లాడారు. "రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. పింఛన్ల కింద ఐదు నెలల్లో రూ.18వేల కోట్లు ఇచ్చాం. లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారని 3 నెలలకోసారి పింఛను తీసుకునే సౌకర్యం కల్పించాం. ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా." అని సీఎం తెలిపారు.