మాచర్లలో ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల జలపాతం (వీడియో)

76చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతలకు వరద ప్రవాహం పెరిగింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎత్తిపోతలకు జలకళ సంతరించుకుంది. 70 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుండగా.. పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్