ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అనుచితమైన పోస్ట్ చేశాడు. మార్క్ శంకర్ ఇక బతకడని దారుణమైన పోస్టు పెట్టాడు. ఈ పోస్టును సీరియస్ గా తీసుకున్న ప్రత్తిపాడు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పోస్టుకు లైకులు కొట్టిన వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు.