పార్లమెంటు ఆమోదించిన ‘వక్ఫ్ సవరణ చట్టం-2025’ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ టీవీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు పలువురు సవాల్ చేయగా.. తాజాగా విజయ్ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, దాఖలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంలో విచారణ జరగనుంది.