AP: కాకినాడ జిల్లా కృష్ణవరం గ్రామంలో తన కోరిక తీర్చాలని వివాహిత పట్ల వెంకటరమణ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని సదరు మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడటంతో వివాహిత బందువులు సతీష్, రాజు, శివ ఎలక్ట్రీషియన్ వెంకటరమణ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. పొలంలో మోటర్ పని చేయడం లేదని వెంకటరమణను పిలిచి దాడి చేశారు. దాడి నుంచి తప్పించుకుని వెంకటరమణ పారిపోయాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.