AP: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై స్కూల్ దశలోనే విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా ఇన్ఫోసిస్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ రూపొందించిన బస్సును మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. స్కూల్ విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్, రోబోటిక్స్, ఏఐ రంగాలపై ట్రైనర్స్ బేసిక్ స్కిల్స్ అందిస్తారని మంత్రి లోకేశ్ అన్నారు.