ఆంధ్రా యూనివర్సిటీ బొల్లినేని మెడ్‌స్కిల్స్ సంస్థతో అనుసంధానమై వైద్య సంబంధిత కోర్సుల ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లొమా ఇన్‌క్రిటికల్ కేర్ టెక్నాలజీ, పీజీ డిప్లామా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ/గ్యాస్ట్రో ఎంటరాలజీ టెక్నాలజీ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో మాత్రమే అందజేయాలి. పూర్తి వివరాల కోసం www.audoa.andhrauniversity.edu.inను చూడగలరు.