AP: సీఎం చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తిరుమల జోలికి వెళ్లొద్దంటూ హెచ్చరించారు. ‘‘మీ కుళ్లు రాజకీయాలకు దేవుడిని వాడుకోవద్దు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే నాశనమైపోతారు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు పురందేశ్వరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.