అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంది. ఇటీవల నాగచైతన్య, శోభిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.