పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ అన్న కూతురు పాత్రలో 'పావని కరణం' నటించింది. మోడలింగ్‌తో కెరీర్ మొదలు పెట్టిన పావని.. గాడ్, సిన్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించడం ద్వారా పుష్ప-1లో ఛాన్స్ సంపాదించింది. పుష్ప-1లో కాసేపు మాత్రమే కనిపించిన ఈ అమ్మాయి పుష్ప-2లో మాత్రం ఎక్కువ సేపు కనిపిస్తుంది. ఈ పాత్రతోనే సినిమా కథ మలుపు తిరుగుతుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా ఈమె గురించే ఉంటుంది.