AP: వైసీపీ కీలక నేతలకు కేసుల భయం వెంటాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పని చేసిన కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్, విడదల రజినిపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కూటమి నేతలు వైసీపీ కీలక నేతలపై కేసులు పెట్టారు. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ వంతు వచ్చింది. ఆయనను కూటమి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.