ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త ఆ వ్యక్తిని సజీవంగా పాతిపెట్టిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. రోహ్‌తక్‌లో జగ్‌దీప్ అనే వ్యక్తి హరిదీప్ ఇంట్లో అద్దెకు ఉంటూ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న హరిదీప్ తన స్నేహితులతో కలిసి అతనిని కిడ్నాప్ చేసి బతికి ఉండగానే పొలంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఇదంతా గతేడాది జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది