AP: దివ్యాంగులకు సర్కారు ఊరటనిచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సదరమ్ స్లాట్ పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఇన్నిరోజులు దివ్యాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన సదరమ్ స్లాట్‌లు నిలిపివేయగా, దివ్యాంగ సంఘాలు విజ్ఞప్తుల మేరకు అర్హులైనవారికి సర్టిఫికేట్‌లు అందజేసేందుకు తిరిగి ప్రారంభించింది. అర్హులైన దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.