వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం ?

68చూసినవారు
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం ?
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో ఆయనపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు ఊపందుకున్నాయి. అయితే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సంధిగ్దత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్