AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నెల్లూరు నుంచి పామూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సంగం కొండ మలుపు వద్ద ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని వెంటనే చికిత్సా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.