ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారన్న ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2023లో దగ్గుబాటి పురంధేశ్వరి ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె పదవీకాలం పూర్తి అవుతుంది. ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవికి చాలా మంది పోటీ పడుతున్నారు. అందులో ఉత్తరాంధ్రకు చెందిన కీలక బీసీ నేత పీవీఎన్ మాధవ్ ఉన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కోసం రేసులో ఉన్నారని అంటున్నారు.