అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్ కీలక ప్రకటన చేశారు. టెస్లా సీఈవో, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. దీనికి మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. అనేక మార్పులను చేయడానికి తాము ఎదురుచూస్తున్నట్లు మస్క్ తెలిపారు. విక్టరీ ఇక్కడి నుంచే మొదలైందన్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని నినదించారు.