AP: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్-2025 సాంస్కృతిక కార్యక్రమంలో ఆదివారం రాత్రి అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. గ్రామాల్లో ఎక్కడైనా తిరునాళ్లలోడ్యాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే పోలీసులు దాడి చేసేవారు. కానీ ఇక్కడ మాత్రం దగ్గరుండి ప్రోత్సాహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ వేదికపై ఉన్నప్పుడే ఈ ప్రదర్శన జరగడం గమనార్హం.