తాను విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించినట్లు వస్తున్న వార్తలను వైసీపీ నేత దేవినేని అవినాష్ ఖండించారు. 'నాపై మీడియా ఛానల్స్, టీడీపీ సోషల్ మీడియా ఖాతాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. దాదాపుగా రెండు నెలల నుంచి విజయవాడలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. మేము తప్పు చేసినట్లు కోర్టు భావించి, ఏ శిక్ష విధించినా ధైర్యంగా స్వీకరిస్తాం' అని ఓ వీడియో విడుదల చేశారు.