ఉత్తరాది రాష్ట్రాల్లో దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 16 డిగ్రీల గరిష్ఠ, 7.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలోనే విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఓ సారి షెడ్యూల్‌ను చూసుకుని బయలుదేరాలని విమానయాన కంపెనీలు ప్రకటన విడుదల చేశాయి.